Prabhas: ‘ఫౌజీ’ షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్!

Prabhas: ‘ఫౌజీ’ షూటింగ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్!

Published on Sep 20, 2024 2:59 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తవక ముందే ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని కూడా స్టార్ట్ చేశాడు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ తన కొత్త సినిమాను రీసెంట్‌గా ప్రారంభించాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ తాజా వార్త వినిపిస్తోంది. ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ రీసెంట్‌గా మధురైలో మొదలైంది. అయితే ఈ షూటింగ్‌లో ప్రభాస్ లేకుండానే సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ ఓ వారం రోజుల పాటు సాగనున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్ ముగించుకుని ‘ఫౌజీ’లో జాయిన్ అవతారని తెలుస్తోంది. ఈ సినిమా 1945 నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీగా రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు