“రాధే శ్యామ్” పై ప్రభాస్ నుంచే సూపర్బ్ ప్రకటన వచ్చిందిగా!

Published on Oct 17, 2020 11:29 am IST

బాహుబలి, సాహో లాంటి రెండు భారీ యాక్షన్ కం విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన చిత్రాల తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టేకప్ చేసిన ప్యూర్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. జిల్ ఫేమ్ రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. కానీ అంతకు ముందు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ అప్డేట్ కోసం ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూసారు.

మొత్తానికి వీరి కలను నిజం చేస్తూ స్వయంగా ప్రభాసే అదిరిపోయే అప్డేట్ ను అందించారు. ఈ అక్టోబర్ 23న టీజర్ వస్తుంది అని ఒక అద్భుతమైన వింటేజ్ పోస్టర్ తో ప్రకటించాడు. అలాగే ఇదే టీజర్ తో బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ ను కూడా పరిచయం చెయ్యనున్నట్టు తెలిపారు.

అంటే బహుశా మ్యూజిక్ పరంగా కూడా ఏదో సర్ప్రైస్ ను ప్లాన్ చేసినట్టున్నారని చెప్పాలి. మొత్తానికి మాత్రం ప్రభాస్ నుంచే ఓ అప్డేట్ రావడం ప్రభాస్ ఫ్యాన్స్ కు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అని చెప్పాలి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ వింటేజ్ లవ్ స్టోరీని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More