టాలీవుడ్ స్టార్ హీరో అయిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం హీరోగా వరుసగా ప్రాజక్ట్స్ తో కెరీర్ పరంగా దూసుకెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అతి త్వరలో ఆదిపురుష్ మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న ప్రభాస్, మరోవైపు ప్రశాంత్ నీల్ తో సలార్, నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె తో పాటు మారుతీ తో మరొక క్రేజీ ప్రాజక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలన్నిటి పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటి లో ప్రసారం అవుతున్న క్రేజీ సరదా షో అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క తాజా ఎపిసోడ్ కి తన స్నేహితుడు యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి వచ్చారు ప్రభాస్.
ఇప్పటికే వీరిద్దరి ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకోగా ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా ప్రసారం చేయబోతున్నట్లు ఆహా వారు తెలిపారు. కాగా ఈ ఎపిసోడ్ కి సంబందించి ప్రస్తుతం ఒక స్పెషల్ ప్రోమోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. అటు ప్రభాస్, ఇటు గోపీచంద్ ఇద్దరూ కూడా సరదా సరదాగా నటసింహం బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్న ఈ ప్రోమో యూట్యూబ్ లో మంచి క్రేజ్ తో దూసుకెళుతోంది. కాగా వీరి ఎపిసోడ్ మొదటి భాగాన్ని డిసెంబర్ 30న అలానే రెండవ భాగాన్ని జనవరి 6న ప్రసారం చేయనున్నారు.