ఇమాన్వికి బ్యూటిఫుల్ విషెస్ చెప్పిన మేకర్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవాపుడితో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి గత కొన్నాళ్ల కితమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుండగా మేకర్స్ సోషల్ మీడియా సెన్సేషనల్ ఇమాన్వి అనే కొత్త అమ్మాయికి టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యిన సమయంలోనే ప్రభాస్ పక్కన ఈ యంగ్ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా ఈ జంటని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ హీరోయిన్ బర్త్ డే వచ్చింది. దీనితో మేకర్స్ ఈమెకి బ్యూటిఫుల్ విషెస్ ని అందించారు. ఆమెపై ఒక అందమైన పోస్టర్ ని పెట్టి ఈమె ఈ చిత్రంలో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఆమెకి డార్లింగ్ ఫ్యాన్స్ విషెస్ చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version