ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ ప‌ట్టాలెక్కేది ఆ రోజే..?

ప్ర‌భాస్ – హ‌ను రాఘ‌వ‌పూడి మూవీ ప‌ట్టాలెక్కేది ఆ రోజే..?

Published on Jul 25, 2024 8:00 PM IST

రెబ‌ల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా ‘క‌ల్కి 2898 AD’ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేసాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్ర‌భాస్ ప‌ర్ఫార్మెన్స్ ను ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేశారు. ఇక వసూళ్ల ప‌రంగా ఈ మూవీ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. అయితే, ఇప్పుడు నెట్టింట ప్ర‌భాస్ నెక్ట్స్ చిత్రాల‌పై జోరుగా చ‌ర్చ సాగుతోంది.

ఇప్ప‌టికే ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో న‌టిస్తున్న ప్ర‌భాస్ తన నెక్ట్స్ మూవీని ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి డైరెక్ష‌న్ లో స్టార్ట్ చేయ‌నున్నాడు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నార‌ట మేక‌ర్స్. అయితే, ఈ సినిమాను ఆగ‌స్టు 22న ప్రారంభించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయట‌. ఈ సినిమాను అదే రోజున షూటింగ్ ప్రారంభించాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంద‌ట‌. ఈ వార్త‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ కోసం చూస్తున్నారు.

ఇక ఈ సినిమా పీరియాడిక్ వార్ నేప‌థ్యంలో రానుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్ర‌భాస్ ఓ సైనికుడిగా క‌నిపిస్తాడ‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయ‌నున్నార‌ట‌.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు