“కల్కి” బాక్సాఫీస్ సునామీ.. 2 రోజుల్లో 300 కోట్లు

రెబల్ స్టార్ ప్రభాస్ కి ఓ సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో మరోసారి ఇపుడు ప్రూవ్ అవుతుంది అని చెప్పాలి. గత ఏడాది వచ్చిన సలార్ తో భారీ వసూళ్లు ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర నమోదు చేయగా ఇప్పుడు వచ్చిన “కల్కి 2898 ఎడి” తో మరోసారి డార్లింగ్ దుమ్ము లేపుతున్నాడు. అయితే కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి రోజే ఏకంగా 191 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా ఇప్పుడు రెండు రోజుల్లో ఏకంగా 300 కోట్ల కోట్లకి గ్రాస్ మేర కొల్లగొట్టేసి విధ్వంసం సృష్టించింది.

మరి డే 2 కి ఈ చిత్రం 107 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని మొత్తం రెండు రోజుల్లో 298.5 కోట్లు గ్రాస్ (పి ఆర్ నంబర్స్ ప్రకారం) 300 కోట్ల దగ్గర వసూలు చేసేసింది. దీనితో ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి కల్కి 500 కోట్ల గ్రాస్ అందుకోడానికి అవకాశాలు గట్టిగానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి చూడాలి కల్కి సునామి ఎక్కడ ఆగుతుందో అనేది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version