అక్కడ షార్ట్ టైం లో భారీ మైల్ స్టోన్ దాటేసిన “కల్కి 2898 ఎడి”

అక్కడ షార్ట్ టైం లో భారీ మైల్ స్టోన్ దాటేసిన “కల్కి 2898 ఎడి”

Published on Jun 29, 2024 8:02 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ అలాగే దీపికా పడుకోణ్ ఇంకా దిశా పటాని లాంటి స్టార్ కాస్ట్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి పురాణాల్ని భవిష్యత్తుని కలగలిపి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ని మరింత పెంచుతూ అదరగొట్టింది.

ఒక యూఎస్ మార్కెట్ నార్త్ అమెరికా ప్రాంతంలో అయితే రికార్డు వసూళ్లతో ఈ సినిమా దూసుకెళ్తుంది. అసలు విత్ ఇన్ షార్ట్ టైం ఏకంగా 7 మిలియన్ డాలర్స్ గ్రాస్ ని కల్కి దాటేసి వండర్ సెట్ చేసింది అని చెప్పాలి. ఈ విషయాన్ని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ లేటెస్ట్ గా షేర్ చేసుకున్నారు. ఖచ్చితంగా ఇది మాత్రం సెన్సేషనల్ స్పీడ్ అని చెప్పాలి. ఇక ఇపుడే ఇలా ఉంటే ఈ సినిమా వీకెండ్ కి 10 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదనే చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు