కన్నడలో యూనిక్ రికార్డు దిశగా “కల్కి”

కన్నడలో యూనిక్ రికార్డు దిశగా “కల్కి”

Published on Jul 25, 2024 4:05 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టిన ఈ చిత్రం ఒక ఎపిక్ బ్లాక్ బస్టర్ గా మరి ఏకంగా 1100 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుంది. అయితే ఈ సినిమా ఒక్క తెలుగు స్టేట్స్ లోనే కాకుండా యూఎస్, హిందీ ఇప్పుడు కన్నడలో కూడా భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది.

అయితే కన్నడలో రీసెంట్ గానే మన తెలుగు నుంచి వెళ్లిన చిత్రాల్లో ఆల్ టైం హెగెస్ట్ గ్రాస్ ని అందుకుంది ఆల్ టైం రికార్డు కొట్టిన ఈ చిత్రం ఇప్పుడు మరో యూనిక్ రికార్డు దిశగా దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కర్ణాటక బెంగళూరు సిటీలో ఆల్ టైం హైయెస్ట్ నెంబర్ షోస్ తో రన్ అయ్యిన చిత్రం “కాంతార” 20 వేలకి పైగా షోస్ తో బిగ్గెస్ట్ రికార్డు సెట్ చెయ్యగా ఇప్పుడు ఈ నెంబర్ కి దగ్గరగా కల్కి స్ట్రాంగ్ రన్ తో దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రస్తుతం కల్కి 18వేల షోస్ దగ్గరలో ఉన్నట్టుగా టాక్. మరి లాంగ్ రన్ లో డెఫినెట్ గా బెంగళూరు సిటీలో కల్కి కాంతార ని క్రాస్ చేసి టాప్ లోకి వస్తుంది అని కన్నడ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా మొత్తానికి అయితే కల్కి యూనానిమస్ రన్ 5వ వారంలోకి వచ్చినా కూడా కొనసాగుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు