రేపటి కోసం.. “కల్కి” మేకర్స్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆర్థిక సాయం

రేపటి కోసం.. “కల్కి” మేకర్స్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆర్థిక సాయం

Published on Sep 3, 2024 8:00 AM IST

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో అయితే భారీ ఎత్తున వరహాలు పడడంతో పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయి. దీనితో వరద బాధితులకి పవన్ కళ్యాణ్, ప్రభాస్ లాంటి హీరోల అభిమానులు ఆహరం అందించడం వంటి సహాయాలు చేసారు.

మరి లేటెస్ట్ గా ఇదే ప్రభాస్ నటించిన భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” మేకర్స్ రేపటి కోసం అంటూ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి వరద బాధితుల కోసం ఆర్ధిక సాయాన్ని అందించారు. మొత్తంగా 25 లక్షల రూపాయలు వారికి సహాయార్ధం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి అందిస్తున్నామని ఈ కష్ట కాలంలో అందరూ అండగా ఉండాలి అని వైజయంతి మూవీస్ వారు రేపటి కోసం ఒకడుగు ముందుకేశారు. మరి వీరి తర్వాత టాలీవుడ్ నుంచి మిగతా నిర్మాణ సంస్థలు కూడా ఇలా ఏమన్నా సాయాన్ని అందిస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు