“కల్కి” అఫీషియల్ టోటల్ రన్ టైం వచ్చేసింది.!

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా కమల్ హాసన్, అమితాబ్ లాంటి లెజెండరీ నటులు నటిస్తున్న చిత్రం “కల్కి 2898 ఎడి” ఒకటి అని చెప్పాలి. ఇంకా ప్రమోషన్స్ చేసి ఉంటే ఇప్పటికన్నా భారీ హైప్ సినిమాపై ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు కూడా గట్టిగానే ఉంది.

అయితే గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా రన్ టైం విషయంలో బజ్ నడుస్తుంది. యూఎస్, ఇండియా వెర్షన్ రన్ టైం లు అంటూ కొన్ని వచ్చాయి కానీ ఇప్పుడు అఫీషియల్ గా రన్ టైం బయటకి వచ్చింది. ఈ సినిమా యూ/ఏ సర్టిఫికెట్ ని అందుకోగా ఏకంగా 180.55 నిమిషాల నిడివితో థియేటర్స్ లోకి రావడానికి సిద్ధం అయ్యింది.

అంటే ఈ సినిమాని మేకర్స్ సరిగ్గా మూడు గంటల 55 సెకండ్ లకి కట్ చేశారు అని చెప్పాలి. మరి ఈ భారీ ట్రీట్ ని థియేటర్స్ లో విట్నెస్ చెయ్యాలని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరికొన్ని రోజులు ఆగితే ఆ రోజు రానే వస్తుంది.

Exit mobile version