యూఎస్ లో “కల్కి” డే 1, ప్రీ సేల్స్ సెన్సేషన్..!

యూఎస్ లో “కల్కి” డే 1, ప్రీ సేల్స్ సెన్సేషన్..!

Published on Jun 25, 2024 9:58 AM IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఇంకా యూనివర్సల్ నటుడు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజ నటులతో యంగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ సెన్సేషనల్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా యూఎస్ మార్కెట్ లో అయితే కల్కి హవా మరో స్థాయిలో ఉందని చెప్పాలి.

నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని జస్ట్ ప్రీ సేల్స్ లోనే రికార్డు మొత్తం 3 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని ఈ చిత్రం దాటేయగా డే 1 కి కూడా రికార్డు నంబర్స్ నమోదు అవుతున్నాయని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. దీనితో ఈ చిత్రం భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ని ఒక్క నార్త్ అమెరికా నుంచే కొల్లగొట్టనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు భారీ వ్యయంతో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు