ఈ ఫార్మాట్ లో కూడా “కల్కి”.. అక్కడ మొట్టమొదటి తెలుగు సినిమాగా

ఈ ఫార్మాట్ లో కూడా “కల్కి”.. అక్కడ మొట్టమొదటి తెలుగు సినిమాగా

Published on Jun 15, 2024 5:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం తెలిసిందే. మరి ఈ సినిమాలో అమితాబ్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు ముఖ్య పాత్రలు చేస్తుండగా రీసెంట్ ట్రైలర్ తో మరిన్ని అంచనాలు ఎక్కువ అయ్యాయి.

ఇక ఈ ప్రపంచ వ్యాప్తంగా నార్మల్ వెర్షన్ లోనే కాకుండా 2డి, 3డి సహా ఐమ్యాక్స్ వెర్షన్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా వీటితో పాటుగా ఈ చిత్రం మరో వెర్షన్ లో కూడా రిలీజ్ కానున్నట్టుగా ఫిక్స్ అయ్యింది. అదే ‘4డిఎక్స్’ వెర్షన్. ఇది 3డి కి అడ్వాన్స్ వెర్షన్ అని చెప్పాలి.

సినిమాలో జరుగుతున్నా సన్నివేశాలకి తగ్గట్టుగా ఈ ఫార్మాట్ లో చూస్తున్న ఆడియెన్స్ కూడా అక్కడే ఉన్నట్టుగా కదలికలు అవీ జరుగుతూ ఉంటాయి. మరి ఇలా రిలీజ్ అవుతున్న మొట్ట మొదటి సినిమాగా యూఎస్ మార్కెట్ లో కల్కి నిలిచింది. మరి మన దేశంలో కూడా ఈ ఫార్మాట్ లో చూడాలని ఆడియెన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈ సినిమా బుకింగ్స్ విషయంలో మున్ముందు మరింత క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు