వరల్డ్ వైడ్ “కల్కి” డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే.!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే దిశా పటాని ఇంకా ఇతర ఫీమేల్ స్టార్స్ కలయికలో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఒక పీరియాడిక్ అండ్ సై ఫై చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్ లో బ్లాస్ట్ లా పడిపోనుండగా ఈ మాసివ్ ఫీస్ట్ ని విట్నెస్ చెయ్యాలని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇలా వరల్డ్ వైడ్ గా చాలా హైప్ ని సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆల్రెడీ సెన్సేషనల్ ప్రీ సేల్స్ జరుపుకుంటుంది. తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో ఇతర ఓవర్సీస్ ప్రాంతాల్లో కూడా క్రేజీ బుకింగ్స్ ఈ చిత్రానికి నమోదు అవుతున్నాయి. దీనితో పాటుగా నార్త్ మార్కెట్ లో కూడా మంచి బుకింగ్స్ ని కల్కి రిజిస్టర్ చేస్తుండగా వీటి అన్నిటితో కలిపి మొదటి రోజు ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ ని కొల్లగొడుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇలా ఈ చిత్రం మొదటి రోజు ఏకంగా 180 నుంచి 200 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే ఛాన్స్ ఉంది అంచనా వేస్తున్నారు. ఇదే కానీ నిజం అయితే ఈ ఏడాదిలో ఇదే బిగ్గెస్ట్ ఓపెనర్ అని చెప్పవచ్చు. అంతే కాకుండా ప్రభాస్ కెరీర్ లో కూడా మరో భారీ ఓపెనర్ గా నిలిచే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమా డే 1 ఎంత రాబడుతుంది అనేది.

Exit mobile version