స్టైలిష్ లుక్ లోకి మారిపోయిన రెబల్ స్టార్!


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడి చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలను కలిగి ఉన్నాడు. అయితే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. స్పిరిట్ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళడానికి ఇంకా టైమ్ పడుతుంది. అయితే ఇప్పుడు ప్రభాస్ లేటెస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మత్తు వదలరా 2 చిత్రం యొక్క ట్రైలర్ ను డిజిటల్ గా లాంఛ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చిత్ర యూనిట్ తో ప్రభాస్ ఉన్న స్టిల్స్ మాత్రం ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తున్నాయి. రెబల్ స్టార్ సూపర్ స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. అయితే దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం ఈ లుక్ అని సమాచారం. ప్రభాస్ ను మాత్రం ఇలా స్టైలిష్ గా చూడటం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version