“కల్కి” ప్రమోషన్స్ కోసం ముంబై కి ప్రభాస్!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కి 2898AD. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. సినిమా రిలీజ్ కి చాలా తక్కువ రోజులు ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

హీరో ప్రభాస్ ప్రమోషన్స్ కోసం ముంబై బయలు దేరారు. హైదరాబాద్ విమానాశ్రయం లో ప్రభాస్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version