క్రేజీ : పవన్ సినిమాపై ప్రభాస్ నుంచి ఊహించని రేంజ్ పోస్ట్.!

Published on Dec 4, 2022 4:00 pm IST

ఈరోజు మన టాలీవుడ్ నుంచి మరో సెన్సేషనల్ కాంబినేషన్ తో అదిరే అనౌన్సమెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ ఓ క్రేజీ యాక్షన్ డ్రామాని అనౌన్స్ చేయగా ఈరోజు టాలీవుడ్ లో ఈ సినిమా కోసమే రచ్చ నడుస్తుంది. ఇక ఈ మాస్ హిస్టీరియా కొనసాగుతూ ఉండగా ఈ సినిమాకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఊహించని రేంజ్ లో విషెస్ తెలియజేయడం ఇప్పుడు కేజ్రీగా మారింది.

తన ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ పై స్టేటస్ పెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాట్స్ తెలుపుతున్నాను అని సుజీత్ తో ఈ కాంబినేషన్ ఓ బ్యాంగ్ లా ఉంటుంది అని నిర్మాత దానయ్య గారికి అలాగే సినిమా యూనిట్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నానని ప్రభాస్ ఇప్పుడు తెలిపాడు. దీనితో ఇద్దరి హీరోల అభిమానులు ఈ సర్ప్రైజింగ్ పోస్ట్ మరింత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి ఆల్రెడీ ప్రభాస్ మరియు సుజీత్ నుంచి “సాహో” అనే భారీ యాక్షన్ థ్రిల్లర్ వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :