ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేస్తోన్న ప్రభాస్ సినిమాలు!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గతి మార్చిన హీరో. బాహుబలి సిరీస్ చిత్రాలతో మాంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ హీరో, ఆ తరువాత భారీ బడ్జెట్ చిత్రాలతో దూసుకు పోతున్నారు. ప్రభాస్ తదుపరి కల్కి (Kalki 2898AD) చిత్రం లో కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మైథాలాజి సైన్స్ ఫిక్షన్ మూవీ లో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ప్రభాస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. కల్కి చిత్రం టైటిల్ రివీల్ కి మరియు టీజర్ లాంఛ్ కి సాన్ డియెగో కామిక్ కాన్ (SDCC) వేదిక అయింది. అలా చేసిన తొలి భారతీయ చిత్రం కల్కి. ఇప్పుడు విష్ణు మంచు టైటిల్ రోల్ లో నటిస్తున్న కన్నప్ప చిత్రం టీజర్ లాంఛ్ కి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదిక అయింది. ఈ చిత్రం లో ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మే 20 వ తేదీన ఈ టీజర్ విడుదల కానుంది. ప్రభాస్ రోల్ ఏంటనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఇప్పుడు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రెండ్ సెట్ చేశారు అని కచ్చితం గా చెప్పాలి.

ఈ చిత్రాలతో పాటుగా ప్రభాస్ స్పిరిట్, ది రాజా సాబ్, సలార్ 2 వంటి భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ఇండియా లోనే అతి పెద్ద స్టార్ అనడానికి ఇవే నిదర్శనం.

Exit mobile version