వన్ అండ్ ఓన్లీ ప్రభాస్.. ఇండియా ట్రెండ్స్ లో తన హవా

వన్ అండ్ ఓన్లీ ప్రభాస్.. ఇండియా ట్రెండ్స్ లో తన హవా

Published on Mar 13, 2024 1:58 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన రీసెంట్ చిత్రం సలార్(Salaar Movie) తో తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం రిలీజ్ తర్వాత ప్రభాస్ నుంచి మరిన్ని భారీ చిత్రాలు రాబోతున్నాయి. అయితే ప్రభాస్ కి ఒక్క తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా కూడా సాలిడ్ మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. దీనితో తన ఏ సినిమా వచ్చినా వస్తున్నా కూడా తన పేరు ఇండియా వైడ్ గా మారు మోగాల్సిందే.

అలా లేటెస్ట్ గా ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ట్రెండ్స్ కి సంబంధించి ఓ రిపోర్ట్ వచ్చింది. గత ఏడాది 2023 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు ఉన్న రిపోర్ట్స్ లో ఇండియన్ వైడ్ గా టాప్ 10 ట్రెండింగ్ ట్యాగ్స్ లో ట్రెండ్ అయ్యిన ఒకే ఒక్క హీరోగా ప్రభాస్ తన ట్యాగ్ తో నిలిచాడు. అలాగే తాను నటించిన “ఆదిపురుష్” కూడా పలు చిత్రాలతో ఈ నిలిచింది. మొత్తానికి అయితే ఇండియా వైడ్ ట్రెండ్స్ లో ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు