షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ‘సలార్’ ?

Published on May 30, 2023 11:02 pm IST

టాలీవుడ్ హీరో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్ కూడా ఒకటి. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండగా హోంబలె ఫిలిమ్స్ సంస్థ పై విజయ్ కిరాగందూర్ దీనిని గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మిస్తున్నారు. మొదటి నుండి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన సలార్ కి రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

విషయం ఏమిటంటే, సలార్ మూవీ నేటితో షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్ జూన్ 16 న గ్రాండ్ గా థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వస్తుండడంతో, దాని రిలీజ్ అనంతరం సలార్ నుండి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక సలార్ ని అన్ని కార్యక్రమాలు ముగించి సెప్టెంబర్ 28న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. తొలిసారిగా ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ చేస్తున్న మూవీ కావడంతో దీనిపై అందరిలో ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :