వైరల్ : కృష్ణంరాజు గారిని తల్చుకుంటూ లవ్లీ వీడియో షేర్ చేసుకున్న ప్రభాస్

Published on Sep 24, 2022 10:30 pm IST


టాలీవుడ్ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న మరణించిన విషయం తెలిసిందే. ఆయన హఠాన్మరణంతో ఒక్కసారిగా ఆయన కుటుంబసభ్యులు, అభిమానులతో పాటు యావత్ చిత్ర సీమ మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. అనంతరం ఆయన అంత్యక్రియలను ప్రభాస్ కుటుంబంతో కలిసి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంచనాలతో ఘనంగా నిర్వహించింది. ఇక ఇప్పటికీ కూడా ప్రభాస్ గారి సతీమణి శ్యామల దేవి, వారి కుమార్తెలు, కుమారుడు ప్రభాస్ సహా ఎవరూ కూడా కృషంరాజు గారి మరణవార్తని మర్చిపోలేకపోతున్నారు.

మరోవైపు పలువురు అభిమానులు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని తరచు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కోరుతున్నారు. ఇక నేడు కొద్దిసేపటి క్రితం పెదనాన్న కృష్ణంరాజుని తల్చుకుంటూ తామిద్దరి సినిమాల్లోని కొన్ని కీలక వీడియో క్లిప్స్ ని కలిపి చేసిన ఒక ఎడిటెడ్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కొద్దిసేపటి క్రితం షేర్ చేసారు. ఆ వీడియోలో ప్రభాస్, కృష్ణంరాజు ఇద్దరూ కూడా ఒకేవిధమైన షాట్స్ లో నటించిన సన్నివేశాలు చూడవచ్చు. మొత్తంగా ప్రభాస్ షేర్ చేసిన ఆ మెమొరబుల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా పలువురు రెబల్ స్టార్ ఫ్యాన్స్ దానిని మరింతగా ట్రెండ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :