పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తదుపరి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్ కే అనే భారీ బడ్జెట్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీలో కనిపించనున్నారు. జనవరి 12, 2024న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటించింది. ప్రాజెక్ట్ కే ఈ సంవత్సరం శాన్ డియాగో కామిక్ కాన్ (SDCC)లో ప్రదర్శించబడిన మొదటి భారతీయ చిత్రం.
ఇప్పటికే చిత్రబృందం అక్కడికి చేరుకోగా, ఈరోజు ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అతను బ్లూ కలర్ సూట్‌లో స్మార్ట్ గా కనిపించాడు. ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లో తమ హీరోను చూసి అభిమానులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రం యొక్క గ్లింప్స్ త్వరలో రిలీజ్ కానుంది. ఈ ఈవెంట్ సందర్భంగా టైటిల్ కూడా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మరియు దిశా పటాని ఇతర ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యాంక్రోల్ చేసింది. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.