ప్రభాస్ ఈసారి భారీగా కొల్లగొట్టడం ఖాయం

Published on Nov 25, 2020 11:08 pm IST


రెబల్ స్టార్ ప్రభాస్ సైన్ చేసిన చిత్రాల్లో బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ కూడ ఒకటి. ఈ సినిమా కోసం ప్రభాస్ ఇప్పటి నుండే సన్నద్దమవుతున్నారు. సన్నబడి కొత్త లుక్ ట్రై చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ప్రభాస్ భారీగానే రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. అయితే కేవలం రెమ్యునరేషన్ ఒక్కటే కాదు.. సినిమాలో లాభాల్లో కూడ ప్రభాస్ వాటా తీసుకోనున్నారని టాక్ వినబడుతోంది. అంటే సినిమా ఎంత భారీగా వసూళ్లు సాదిస్తే ప్రభాస్ చేతికి అంత భారీ మొత్తం వస్తుందన్నమాట.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృషన్ కుమార్ నిర్మిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో నటించనున్నారు. 2022 ఆగష్టు 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చేస్తున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ ముగియగానే ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు ప్రభాస్. దీని తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షనల్ మూవీ చేయనున్నారు. ఈ సినిమాలు మూడు కూడ హెవీ బడ్జెట్ సినిమాలే.

సంబంధిత సమాచారం :

More