“కల్కి” లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్…థాంక్స్ తెలిపిన ప్రభాస్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి2898AD చిత్రం కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నేడు ఇన్ స్టాగ్రామ్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మరియు ప్రభాస్ లు లైవ్ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

యంగ్ హీరోలు అయిన విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ల రోల్స్ పై క్లారిటీ వచ్చింది. వీరిద్దరూ కల్కి చిత్రంలో నటిస్తున్నట్లు నాగ్ మరియు ప్రభాస్ లు కన్ఫర్మ్ చేశారు. అంతేకాక ఇందులో నటించినందుకు ప్రభాస్ ఇద్దరికీ కూడా థాంక్స్ తెలిపారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఇంకా ఎన్నో సర్ప్రైజ్ లు ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version