ఊహించని లుక్ లో ప్రభాస్.. పర్ఫెక్ట్ గిఫ్ట్ గా “ది రాజా సాబ్” మోషన్ పోస్టర్ టీజర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా వీటిలో ప్రభాస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా “ది రాజా సాబ్” కూడా ఒకటి. అయితే ఈరోజు ప్రభాస్ బర్త్ డే కానుకగా ఈ సినిమా నుంచి మేకర్స్ అదిరే ట్రీట్ ని అయితే ఇచ్చేశారు.

ప్రభాస్ పై ఎవరూ ఊహించని ఒక సరికొత్త మేకోవర్ కి చెందిన పోస్టర్ ని రిలీజ్ చేయగా ఇంట్రెస్టింగ్ గా ఇందులో ప్రభాస్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఇది వరకు చూడని విధంగా కనిపించాడు. అలాగే మోషన్ పోస్టర్ టీజర్ కూడా థ్రిల్లింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ గా ప్రభాస్ బర్త్ కి తగ్గట్టుగా పియానో పై హ్యాపీ బర్త్ డే ట్యూన్ తో ఇది మొదలై మంచి థ్రిల్ ఎలిమెంట్స్ తో సాగింది.

మొత్తానికి అయితే ఒక పర్ఫెక్ట్ ట్రీట్ ని మేకర్స్ అందించారు అని చెప్పాలి. అలాగే ఫ్యాన్స్ కూడా ఇది చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version