ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేస్తున్న ప్రభాస్ ?

Published on Mar 4, 2021 3:03 am IST


ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయనతో సినిమా అంటే వందల కోట్లతో వ్యవహారం. దేశంలో ఏ హీరో తీసుకోనంత భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్నారు ఆయన. ‘బాహుబలి 1, 2, సాహో’ చిత్రాలతో ఆయన క్రేజ్ దేశవ్యాప్తమైంది. తెలుగు నిర్మాతలు, దర్శకులు ఎంతలా ఆయన డేట్ల కోసం ఎదురుచూస్తున్నారో బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు కూడ అలాగే ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. వాటిలోప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒప్పుకున్న ‘సలార్’ సెట్స్ మీద ఉంది.

ఇంకొన్నిరోజుల్లో ఓం రౌత్ డైరెక్షన్లో ‘ఆదిపురుష్’ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా పనులన్నీ పూర్తిగా ముంబైలోనే జరుగుతాయి. కాబట్టి ఈ ఏడాదిలో చాలా సమయం ప్రభాస్ ముంబైలోనే ఉండాల్సి ఉంటుంది. కొన్ని రోజులకైతే హోటల్లో గడపవచ్చు కానీ నెలల తరబడి హోటల్లో ఉండటమంటే కష్టమని, పైగా తరచూ హిందీలో సినిమాలు చేసే ప్లాన్స్ కూడ ఉండటం మూలాన అక్కడ ఒక సొంత ఇంటిని కొనుగోలుచేయాలని డిసైడ్ అయ్యారట ఆయన. ప్రభాస్ టీమ్ ప్రస్తుతం ముంబైలోని ఒక ఖరీదైన ప్రాంతంలో మంచి ఇంటిని వెతుకుతోందట.

సంబంధిత సమాచారం :