‘ది రాజా సాబ్’పై స్పీడ్ పెంచనున్న ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతూ బిజీగా ఉన్నాడు. ‘కల్కి 2898 AD’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో, ఆయన చేయబోయే నెక్స్ట్ చిత్రాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌కి చేరుతున్నాయి. ఇక ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం ఇప్పటికే జరుపుకుంది. కామెడీ హార్రర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డార్లింగ్ లుక్స్‌తో ప్రభాస్ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్‌పై ప్రభాస్ స్పీడ్ పెంచాలని చూస్తున్నాడు. నవంబర్ చివరి నాటికి ‘రాజా సాబ్’ షూటింగ్‌ను ముగించేయాలని ఆయన చూస్తున్నాడట.

ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా రీలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version