రెబల్ స్టార్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెరీ స్పెషల్ విషెష్.!

రెబల్ స్టార్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెరీ స్పెషల్ విషెష్.!

Published on Jan 20, 2022 11:00 AM IST

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి ఎందరో దిగ్గజ నటులలో ఒకప్పటి డాషింగ్ హీరో రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా ఒకరు. మరి ఈరోజు ఆయన బర్త్ డే కావడంతో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తుండగా ఆయన సహకారంతో టాలీవుడ్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గా పరిచయం అయ్యి ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా మారి ఇండియన్ సినిమాను ఏలుతున్నాడు.

అయినప్పటికీ మాత్రం తన పెదనాన్న అంటే ప్రభాస్ కి ఇప్పటికీ కూడా ఎంతో ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మరి ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా తాను కూడా తన సోషల్ మీడియాలో వెరీ స్పెషల్ విషెష్ ని తెలియజేసాడు. తన భారీ సినిమా రాధే శ్యామ్ నుంచి ఒక స్పెషల్ పోస్టర్ తో మా అంకుల్ ది రెబల్ స్టార్ కృష్ణం రాజు గారికి బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నాను, మీ వివేకం, గైడెన్స్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాని ప్రభాస్ తెలిపాడు. దీనితో రెబల్ స్టార్ ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు