యూఎస్ లో సలార్ ప్రీమియర్స్ కి డేట్ ఫిక్స్!

యూఎస్ లో సలార్ ప్రీమియర్స్ కి డేట్ ఫిక్స్!

Published on Nov 7, 2023 3:01 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ చిత్రం డిసెంబర్ 22, 2023 న థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే యూఎస్ ప్రాంతం లో ఈ సినిమా ప్రీమియర్ షోలు డిసెంబర్ 21 న స్టార్ట్ కానున్నాయి. ఈసారి రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశాలు లేవని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నవారు సైతం స్పష్టం చేస్తున్నారు.

ప్రభాస్ ను మాస్ అవతార్ లో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ భారీ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు