అదరగొట్టిన ప్రభాస్ “ది రాజా సాబ్” ఫస్ట్ లుక్!


రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను మేకర్స్ నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి ది రాజా సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేసారు మేకర్స్. అదే విధంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.

రిలీజైన ఫస్ట్ లుక్ లో రెబల్ స్టార్ ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. నల్ల చొక్కా, లుంగీ ధరించి మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు తో పాటుగా, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Exit mobile version