ధనుష్ కోసం రంగంలోకి దిగిన ప్రభుదేవా !

ధనుష్ కోసం రంగంలోకి దిగిన ప్రభుదేవా !

Published on Aug 1, 2018 6:45 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం ‘మారి 2’ చిత్రంలో నటిస్తున్నారు. బాలాజీ మోహన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. 2015లో ధనుష్, కాజల్ జంటగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘మారి’ కి సీక్వెల్ గా తెరకెక్కితుంది ఈ చిత్రం. ఇక ఈ చిత్రంలోని ఒక సాంగ్ కు ప్రముఖ కొరియోగ్రఫర్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేస్తున్నారు. గత కొంత కాలంగా దర్శకుడు గా బిజీ అవుతున్న ప్రభుదేవా వేరే సినిమాలకు కొరియోగ్రఫీ చేయడం తగ్గించేశారు. ఇప్పుడు తాజాగా ఆయన కంపోజ్ చేసిన డాన్స్ ను ఈ చిత్రంలో చూడబోతున్నాం.

సాయి పల్లవి కథనాయికాగా నటిస్తున్న ఈచిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ధనుష్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ వుండెర్ బార్ ఫిలిమ్స్ పతాకం ఫై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ,విద్య , రోబో శంకర్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇంతకుముందు తెలుగులో మారి చిత్రాన్ని ‘మాస్’ పేరుతో విడుదలచేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు