సమీక్ష : ప్రభుత్వ జూనియర్‌ కళాశాల – రొటీన్ అండ్ బోరింగ్ లవ్ డ్రామా !

Prabhutva Junior Kalasala  Movie Review in Telugu

విడుదల తేదీ : జూన్ 21, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: ప్రణవ్‌ సింగంపల్లి, షగ్న శ్రీ వేణున్‌ తదితరులు.

దర్శకుడు: శ్రీనాథ్‌ పులకురం.

నిర్మాతలు : భువన్‌ రెడ్డి కొవ్వూరి

సంగీత దర్శకుడు: కార్తీక్‌ రోడ్రిగ్యెజ్‌

సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ సురేంద్రన్‌

ఎడిటింగ్: కోదాటి పవన్‌ కల్యాణ్‌

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రణవ్‌ సింగంపల్లి, షగ్న శ్రీ వేణున్‌ జంటగా శ్రీనాథ్‌ పులకురం దర్శకత్వంలో భువన్‌ రెడ్డి కొవ్వూరి ఈ ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ మూవీ ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..

 

కథ :

ఈ కథ 2004 నేపథ్యంలో సాగింది. రాయలసీమలోని పుంగనూరు అనే గ్రామంలో ఉండే వాసు (ప్రణవ్ ప్రీతమ్) అనే కుర్రాడి చుట్టూ ఈ కథ సాగింది. వాసు ఇంటర్మీడియట్‌ ఫస్టియర్ చదువుతూ ఉంటాడు. అదే కాలేజీలో సీఈసీ చదువుతున్న కుమారి (షగ్న శ్రీ వేణున్)తో వాసు ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తోంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో వాసు – కుమారి మధ్య గొడవ జరుగుతుంది. కుమారి గురించి వాసుకి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇంతకీ, ఏమిటి ఆ విషయాలు ?, అసలు కుమారి ప్రేమ నిజామా ? అబద్దమా ?, వాసు ఎందుకు చనిపోవాలనుకున్నాడు ?, చివరకు వాసు కథ ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

లవ్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని చోట్ల బరువైన భావోద్వేగాలతో సాగిన ఈ ప్రభుత్వ జూనియర్ పాఠశాల మూవీలో బరువైన ప్రేమ కథ ఉంది. ఎమోషనల్ గా సాగే క్లైమాక్స్‌ బాగుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన వాసు పాత్ర.. ఆ పాత్రకి సంబంధించిన లవ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు కామెడీ సీన్స్.. మరియు వాసు ఫ్యామిలీ సెంటిమెంట్.. ఇలా మొత్తానికి ప్రభుత్వ జూనియర్ పాఠశాల మూవీ కాన్సెప్ట్ అండ్ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ పరంగా ఆకట్టుకుంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదు. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రణవ్‌ సింగంపల్లి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ ప్రణవ్‌ సింగంపల్లి ఈ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. హీరోయిన్ షగ్న శ్రీ వేణున్‌ కూడా ఈ సినిమాలో చాలా బాగా నటించింది. అలాగే తన గ్లామర్ తో సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఈ ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగుతుంది. అలాగే, సినిమాలో కాన్ ఫ్లిక్ట్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం, ఇక మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు హీరో క్యారెక్టర్ తాలూకు జర్నీ గ్రాఫ్ కూడా బాగా లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. నిజానికి, ఈ జనరేషన్ లో ఇలాంటి ప్రేమ కథలను చూడటానికి యూత్ ఆసక్తి చూపిస్తారు.

ఐతే, ఆ కంటెంట్ లో ఫ్రెష్ నెస్ తో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. ఈ సినిమాలో ఆ ఇంట్రెస్ట్ మిస్ అయ్యింది. అయితే, దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం పనితనం, హీరో ప్రణవ్‌ సింగంపల్లి నటన సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ… కథ కథనాల్లో కొత్తదనం లేకపోవడం, ప్లే కూడా స్లోగా సాగడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి.

దీనికితోడు అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతూ విసిగిస్తాయి. మొత్తానికి ఈ ఎమోషనల్ లవ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని బోల్డ్ ఎలిమెంట్స్ పర్వాలేదకున్నా.. మిగిలిన కంటెంట్ ఆసక్తికరంగా అయితే సాగలేదు.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథకథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు కార్తీక్‌ రోడ్రిగ్యెజ్‌ సమకూర్చిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. కెమెరామెన్ నిఖిల్‌ సురేంద్రన్‌ వాటిని తెరకెక్కించిన విధానం బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాత భువన్‌ రెడ్డి కొవ్వూరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో కొన్ని బరువైన భావోద్వేగాలు అండ్ క్లైమాక్స్ బాగానే ఉన్నాయి. ఐతే, కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కొన్ని ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకున్నా.. ఈ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team\

Click Here For English Review

Exit mobile version