మరో ఓటిటిలోకి కూడా వచ్చిన “ప్రభుత్వ జూనియర్ కళాశాల”

మరో ఓటిటిలోకి కూడా వచ్చిన “ప్రభుత్వ జూనియర్ కళాశాల”

Published on Aug 29, 2024 7:32 AM IST

యువ నటీనటులు ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన రీసెంట్ చిత్రమే “ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143”. ఓక యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాని నిర్మించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. థియేటర్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే రీసెంట్ గానే ఈ చిత్రం మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు మరో అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వస్తుంది. అంతా కొత్త వారితో చేసిన ఈ చిన్న చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది. ఆహాలో ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రం ప్రస్తుతం ఆహాతో పాటుగా యూఎస్ ఆడియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వచ్చే వారం నుంచి ఇండియన్ ఆడియెన్స్ కోసం ఆహాతో పాటుగా అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది. ప్రతీ మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు.

‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు ‘ఆహా’లో ఫామిలీ ప్రేక్షకుల ప్రసంశలు పొందుతోంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. మరో వారం తరువాత అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు