ట్రెండింగ్ లో ‘ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల’ ట్రైల‌ర్

ట్రెండింగ్ లో ‘ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల’ ట్రైల‌ర్

Published on Jun 14, 2024 11:30 AM IST

ప్ర‌ణ‌వ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంట‌గా తెర‌కెక్కుతున్న సినిమా “ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల, పుంగ‌నూరు-500143” ఇప్ప‌టికే షూటింగ్ ప‌నులు ముగించుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను డైరెక్ట‌ర్ శ్రీనాథ్ ఓ యదార్థ సంఘ‌ట‌న ఆధారంగా తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఈ చిత్ర ట్రైల‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

కాగా, ఇంట‌ర్మీడియ‌ట్ టీనేజ్ ల‌వ్ స్టోరీగా ఈ సినిమాను మేక‌ర్స్ రూపొందించారు. అయితే, ప్ర‌స్తుతం ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌టంతో మేక‌ర్స్ హ్యాపీగా ఉన్నారు. ట్రైలర్ బాగుందంటూ సినీ ప్రియులు, నెటిజన్స్ నుంచి కామెంట్స్ వ‌స్తుండ‌టం సంతోషాన్ని క‌లిగించాయని వారు అంటున్నారు.

ఇక ట్రైల‌ర్ కు వ‌స్తున్న రెస్పాన్స్ మూవీకి కూడా వ‌స్తుంద‌ని వారు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఓ చ‌క్క‌టి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ‌ని.. వారు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తార‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాగా, ఈ సినిమాను జూన్ 21న థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు