విడుదల తేదీ : ఏప్రిల్ 11, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి, సత్య, గెటప్ శ్రీను, రోహిణి, మురళీధర్ గౌడ్, వెన్నెల కిషోర్ తదితరులు
దర్శకుడు : నితిన్-భరత్
నిర్మాణం : మాంక్స్ & మంకీస్
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : ఎంఎన్. బాల్ రెడ్డి
ఎడిటర్ : కొడటి పవన్ కళ్యాణ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు, మరో యాంకర్ దీపిక పిల్లి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. నితిన్-భరత్ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
ఓ గ్రామంలో 60 మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమె పుట్టడంతో గ్రామానికి మంచి జరుగుతుంది. దీంతో ఆమెకు రాజా అనే పేరు పెడతారు. ఆ 60 మంది అబ్బాయిలలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని.. ఆమె ఆ ఊరు దాటకుండా ఉండాలని ఆ గ్రామ పెద్ద నిర్ణయిస్తాడు. ఆ ఊరిలో ఇంజినీరింగ్ వర్క్ పై హీరో అక్కడికి వస్తాడు. రాజాతో ప్రేమలో పడ్డ హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడా..? ఆ 60 మంది అబ్బాయిలు ఏం చేశారు..? అసలు రాజా ఆ ఊరు దాటుతుందా లేదా..? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
దర్శకులు నితిన్-భరత్ ఈ సినిమాకు రాసుకున్న కథ బాగుంది. ఓ అమ్మాయి కారణంగా గ్రామానికి మంచి జరగడం.. దాంతో అక్కడి 60 మంది అబ్బాయిలు ఆమెను పెళ్లాడాలనే పాయింట్ కొత్తగా ఉంది. దీనికి కామెడీ టచ్ ఇచ్చి వెండితెరపై ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోతో పాటు సత్య చేసే కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.
ఊరిజనంతో హీరో, సత్య పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి. 60 మంది అబ్బాయిలలో గెటప్ శ్రీను కూడా ఆకట్టుకుంటాడు. సత్య, గెటప్ శ్రీను చేసే కామెడీ నవ్విస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్‌కు మరో మేజర్ అసెట్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. కథను ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు. కథను దర్శకులు ట్రీట్ చేసిన విధానం ప్రేక్షకును మెప్పిస్తుంది.
హీరోయిన్‌గా దీపిక కూడా మంచి పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇక రథన్ అందించిన సంగీతం కూడా బాగుంది. ఒకట్రెండు పాటలు ఇంప్రెస్ చేస్తాయి. ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ కూడా తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తాడు.
మైనస్ పాయింట్స్ :
కథ కోసం రాసుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని సినిమా మొత్తం ఆసక్తికరంగా తీసుకెళ్లడంలో దర్శకులు తడబడ్డారు. ఫస్టాఫ్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందో, సెకండాఫ్ అంత ల్యాగ్ అనిపిస్తుంది. అయితే, సెకండాఫ్‌లో కొన్ని ఎమోషన్స్ పండటం విశేషం.
హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ కథకు ఆటంకం కలిగించాయని చెప్పాలి. 60 మంది అబ్బాయిలు ఉన్నా, వారిలో గుర్తుపట్టే ఆర్టిస్టులు కేవలం ఇద్దరే. మిగతా వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పాలి.
ఇక సాంగ్స్ విషయానికి వస్తే, సెకండాఫ్‌లో కొన్ని పాటలు కేవలం సినిమా నిడివి కోసమే పెట్టినట్లు అనిపిసాయి. అవి ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా సినిమాకు డ్యామేజ్ చేశాయి. ఇంటర్వెల్ పర్వాలేదనిపించినా, క్లైమాక్స్ మాత్రం చాలా చప్పగా సాగింది. మంచి పాయింట్‌ను చివర్లో వేస్ట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది.
సాంకేతిక విభాగం :
దర్శకులు నితిన్-భరత్ ఎంచుకున్న కథ బాగుంది. కానీ, దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడంలో వారు తడబడ్డారు. స్క్రిన్ ప్లే విషయంలో ఫస్ట్ హాప్ ఫర్వాలేదనిపిస్తుంది. కానీ, సెకండాఫ్‌లో స్క్రీన్ ప్లే స్లోగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కొన్ని సీన్స్‌ను చక్కగా చూపెట్టారు. రథన్ సంగీతం కొంతవరకు ఆకట్టుకున్నా, సెకండాఫ్ లోని కొన్ని సాంగ్స్ ఆకట్టుకోవు. బీజీఎంకు అంత ప్రాధాన్యత దక్కలేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
మొత్తంగా చూస్తే.. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. సత్య, గెటప్ శ్రీను కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. ప్రదీప్, దీపికల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. అయితే, సెకండాఫ్‌లోని ల్యాగ్ సీన్స్, కొన్ని పాటలు ఆకట్టుకోవు. ఓవరాల్‌గా ఈ వీకెండ్ ఫ్యామలీతో కలిసి మూవీ ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team