కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ అలాగే కయదు లోహర్ లు హీరోయిన్స్ గా దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “డ్రాగన్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరిట విడుదల అయ్యి ఇక్కడ కూడా సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కి వచ్చేసింది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా ఇందులో ఈరోజు నుంచి ఎట్టకేలకు అలరించేందుకు వచ్చేసింది. తమిళ్, హిందీలో డ్రాగన్ గా తెలుగు సహా ఇతర ముఖ్య సౌత్ భాషల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ గా వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యినవారు ఎవరైనా ఉంటే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి