పూజా కార్యక్రమాలతో మొదలైన ప్రదీప్ రంగనాథన్ కొత్త చిత్రం

ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ తన నెక్స్ట్ చిత్రాన్ని క్రేజీ కాంబినేషన్‌తో తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో ప్రదీప్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు.

దర్శకుడు కీర్తిశ్వరణ్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రదీప్ రంనాథనక సరసన అందాల భామ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక PR04 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కి్స్తున్నారు మేకర్స్.

Exit mobile version