టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్’ వంటి పలు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, స్టార్ హీరోయిన్ కాలేకపోయిన ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని, మొదటి బిడ్డ జన్మనిచ్చింది. ఆ పాపకు అర్నా అని పేరు పెట్టారు.
ఐతే, ఇప్పుడు మరోసారి ప్రణీత సుభాష్ తల్లి కాబోతుంది. తాజాగా తన బేబీ షవర్ వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది ఈ బ్యూటీ. బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ప్రణీత సుభాష్ కి తమదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నారు.