‘దేవకీ నందన వాసుదేవ’ కథకు ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ అంతా..?

టాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాగా ‘హను-మాన్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తీరుకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమా దుమ్ములేపడంతో ప్రశాంత్ వర్మ టాలీవుడ్‌లో ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. అయితే, ఇప్పుడు ఈ డైరెక్టర్ రాసిన కథ టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాల్లో ‘దేవకీ నందన వాసుదేవ’ కూడా ఒకటి. ఈ సినిమాకు కథను ప్రశాంత్ వర్మ అందించాడు. దీంతో ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనికితోడు ప్రశాంత్ వర్మ స్టయిల్‌లోనే ఇది కూడా సోషియలో ఫాంటెసీ మూవీగా రాబోతున్నట్లు టీజర్, ట్రైలర్లలో కనిపించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి క్రియేట్ అయ్యింది. కానీ, శుక్రవారం రోజున మొదటి ఆటకే ఈ సినిమాలో పెద్దగా మ్యాటర్ ఏమీ లేదని ప్రేక్షకులు తేల్చేశారు.

దీంతో ఈ సినిమాకు చాలా చోట్ల నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఈ సినిమాకు కథ అందించిన ప్రశాంత్ వర్మ ఏకంగా రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ కథకు అంత మొత్తం రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువ అనే చర్చ ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఎలాంటి కొత్తదనం లేని ఈ కథకు నిర్మాతలు ఎందుకు అంత రెమ్యునరేషన్ ఇచ్చారో వారికే తెలియాలి అని పలువురు కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version