‘జై హనుమాన్’ అప్డేట్‌ను రెడీ చేసిన ప్రశాంత్ వర్మ!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో తెరకెక్కించే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ‘హను-మాన్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ కూడా ఉంటుందని ప్రశాంత్ వర్మ గతంలోనే తెలిపాడు.

ఇక ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి సరికొత్త అప్డేట్‌ను రెడీ చేశాడు ఈ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో 7వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్‌ని దీపావళి కానుకగా అక్టోబర్ 30న అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ తాజాగా వెల్లడించారు.

దీంతో ఈ సినిమాపై అప్పుడే ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుండి రాబోయే కొత్త అప్డేట్ ఏమై ఉంటుందా.. అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి దీపావళి కానుకగా ప్రశాంత్ వర్మ ఇవ్వబోయే ట్రీట్ ఏమిటో తెలియాలంటే అక్టోబర్ 30 వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version