యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంటున్నాడు. ఈ దర్శకుడు తెరకెక్కించిన హను-మాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆయన చేయబోయే నెక్ట్స్ చిత్రాలపై ఆసక్తి పెరిగింది. అయితే, ఓ మాస్ హీరోతో ఈ యంగ్ డైరెక్టర్ త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మాస్ రాజా రవితేజ కోసం ప్రశాంత్ వర్మ ఓ కథను రెడీ చేశాడని.. అన్నీ కుదిరితే ఈ సినిమాను వచ్చే ఏడాదిలో మొదలుపెట్టేందుకు ప్రశాంత్ వర్మ సిద్ధంగా ఉన్నట్లుగా సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం ఆయన హను-మాన్ సీక్వెల్ మూవీని తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు.
అటు మాస్ రాజా రవితేజ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో, ఆయన ఓకే చేసిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే ప్రశాంత్ వర్మతో మూవీకి రెడీ అవుతాడని తెలుస్తోంది. మరి నిజంగానే ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుందా అనేది వేచి చూడాలి.