“దేవర” గ్లింప్స్ స్టన్నింగ్ – ప్రశాంత్ వర్మ

“దేవర” గ్లింప్స్ స్టన్నింగ్ – ప్రశాంత్ వర్మ

Published on Jan 9, 2024 1:03 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఏప్రిల్ 5, 2024 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం కి సంబందించిన గ్లింప్స్ వీడియో ను మేకర్స్ రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ గ్లింప్స్ వీడియో పై హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కామెంట్స్ చేశారు.

గ్లింప్స్ వీడియో స్టన్నింగ్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక డైరెక్టర్ కొరటాల శివ కి, ఎన్టీఆర్ కి మరియు చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు. దేవర చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు