హను మాన్ వచ్చినప్పుడల్లా అలా అరుస్తున్నారు – ప్రశాంత్ వర్మ!

హను మాన్ వచ్చినప్పుడల్లా అలా అరుస్తున్నారు – ప్రశాంత్ వర్మ!

Published on Jan 23, 2024 1:34 PM IST


ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆడియన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం, హనుమంతుని యొక్క అతీత శక్తులను పొందే ఒక చిన్న దొంగ, దుష్ట శక్తులతో పోరాడటానికి వాటిని ఎలా ఉపయోగిస్తాడు అనే దాని గురించి ఉంటుంది. అమృత అయ్యర్ ఇందులో కథానాయికగా నటించింది. ఆడియన్స్ రెస్పాన్స్ గురించి ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇంటర్నెట్‌లో ఇప్పుడు వైరల్ అవుతోంది.

హనుమంతుడి విగ్రహాన్ని తెరపై చూసినప్పుడల్లా ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరోని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అలాగే హనుమంతుడిని కూడా పండగ చేసుకుంటున్నారు అని ప్రశాంత్ వర్మ అన్నారు. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్‌ను కూడా చేరుకునే దిశగా సాగుతోంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్య కీలక పాత్రలు పోషించారు. గౌర హరి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు