సినీ ప్రేమికులందరికీ ఈ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను – ప్రశాంత్ వర్మ

సినీ ప్రేమికులందరికీ ఈ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను – ప్రశాంత్ వర్మ

Published on Jan 16, 2024 11:40 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరి సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే సినిమా సక్సెస్ కావడం పట్ల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు.

థాంక్యూ. నా హృదయం ప్రేమ మరియు కృతజ్ఞతతో నిండి ఉంది. హనుమాన్‌ చిత్రంతో అద్భుతమైన విజయాన్ని అందించిన అద్భుతమైన సినీ ప్రేమికులందరికీ ఈ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీ స్పందనలు, ప్రశంసలు మరియు అపరిమిత ప్రేమ గత కొన్ని రోజులుగా నన్ను సంపూర్ణంగా చేశాయి. నా జీవితాంతం సున్నితంగా నాతో ఉంచుకుంటాను. హనుమాన్‌ని ప్రతిచోటా వ్యాపింపజేసినందుకు మరోసారి ధన్యవాదాలు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు