కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసే హీరోగా నారా రోహిత్‌కు మంచి పేరు ఉంది. ఆయన ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకులు ఆయన సినిమాలను ఆదరిస్తుంటారు. అయితే, ఆయన రీసెంట్‌గా నటించిన ‘ప్రతినిధి-2’ మూవీ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ప్రతినిధి’కి ఇది సీక్వెల్‌గా రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపెట్టారు.
అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ‘ప్రతినధి-2’ కథ బాగున్నా, ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సినిమా సక్సెస్ కాలేదు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.
సెప్టెంబర్ 27న ‘ప్రతినిధి-2’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.