ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : ఏప్రిల్ 10, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్ తదితరులు
దర్శకుడు : శ్రీరాజ్ శ్రీనివాసన్
నిర్మాత : అన్వర్ రషీద్
సంగీతం : విష్ణు విజయ్
సినిమాటోగ్రఫీ : షైజు ఖాలిద్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రాలకు పేరొందిన మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూవీ ‘ప్రవింకూడు షాపు’. డార్క్ కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని శ్రీరాజ్ శ్రీనివాసన్ తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో సౌబిన్ షాహిర్, బాసిల్ జోసెఫ్, చెంబన్ వినోద్ జోస్ ముఖ్య పాత్రల్లో నటించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కల్లు దుకాణం నడుపుకునే కొంబన్ బాబు(శివజిత్) ఓ రాత్రి తన షాపులో ఉరితాడుకు వేలాడుతుంటాడు. అదే సమయంలో అక్కడున్న 11 మంది ఈ ఘటనను చూస్తారు. ఈ కేసును టేకప్ చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంతోష్(బాసిల్ జోసెఫ్) ఆ 11 మందిని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. కల్లు దుకాణంలో పనిచేసే కన్నన్(సౌబిన్ షాహిర్), అదే గ్రామంలో ఉండే సుని(చెంబన్ వినోద్ జోస్) కూడా ఈ 11 మందిలో ఉంటారు. ఇంతకీ వారికి కల్లు దుకాణం యజమానితో ఎలాంటి సంబంధం ఉంది..? కథలోకి మెరిండా(చాందిని శ్రీధరన్) ఎందుకు వచ్చింది..? ఆమెకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం ఉంది..? సంతోష్ అసలు నేరస్థుడిని పట్టుకుంటాడా..? అనేది సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి చనిపోవడం.. దానిని ఇన్వెస్టిగేట్ చేసేందుకు పోలీసులు రావడం.. చాలా రొటీన్ టెంప్లేట్ కథతోనే ఈ సినిమాను నడిపించారు. కానీ, నెరేషన్‌లో దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ ప్రేక్షకులను ఏ విధంగా అయితే ఎంగేజ్ చేశాడో అది బాగుంది. డార్క్ కామెడీని జోడించి ఓ సింపుల్ క్రైమ్ థ్రిల్లర్ కథను ముందుకు తీసుకెళ్లిన విధానం బాగుంది.
ఇక కథలోని పాత్రలు, వాటిని మెయిన్ ప్లాట్‌కు లింక్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 11 మందిని ఇన్వెస్టిగేట్ చేసే తీరును.. దానికి రిలేటెడ్ సీన్స్‌ను తెరపై చూపెట్టిన విధానం బాగుంది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాసిల్ జోసెఫ్ ఆకట్టుకుంటాడు. మెరిండా రాకతో సినిమా కథ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. ఆమె పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలోని ప్రీ-క్లైమాక్స్‌ను దర్శకుడు ఎంత బలంగా రాసుకున్నాడో.. క్లైమాక్స్‌ను అంత తేలిగ్గా ముగంచాడు. హత్య వెనకాల ఉన్న ట్విస్టులను రివీల్ చేసిన విధానం బాగుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభంలో హత్య జరగడంతో అక్కడున్న వారు చేసే చేష్టలు కొంతమేర ప్రేక్షకులను మెప్పించవని చెప్పాలి. ఇక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో రిపీటెడ్‌గా ఒకే విధమైన సీన్స్ రావడం ప్రేక్షకులను మెప్పించదు. కథను సీరియస్ టోన్‌లోకి మారుస్తూనే, డార్క్ కామెడీని జోడించడం ఒకింత చిరాకు తెప్పిస్తుంది.
ఇక ఈ సినిమా స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది. అప్పుడు ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేది. ఇక క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు కావాల్సిన ట్విస్టులు ఈ సినిమాలో కూడా ఉన్నాయి. కానీ, వాటి ప్లేస్మెంట్ సరిగ్గా లేదని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఇక నటీనటుల విషయంలోనూ హీరో పాత్రకు సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను సరిగా హ్యాండిల్ చేయలేదని కనిపిస్తుంది. హీరో పాత్రకు కామెడీ సీన్స్ యాడ్ చేసి ఆయన పాత్రను తేలిపోయేలా చేసింది.
సాంకేతిక వర్గం :
దర్శకుడు శ్రీరాజ్ శ్రీనివాసన్ ఎంచుకున్న కథ రొటీన్ అయినప్పటికీ, దాన్ని ఆయన డార్క్ కామెడీతో ముందుకు తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం కొంతమేర వర్కవుట్ అయ్యింది. కానీ, కథను ఆయన హ్యాండిల్ చేసిన తీరు ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయింది. ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కానీ, ఈ కథకు బీజీఎం చాలా మేజర్ అసెట్‌గా నిలిచందని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఓకే.
తీర్పు :
ఓవరాల్‌గా చూస్తే.. క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథకు డార్క్ కామెడీ యాడ్ చేసి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన తీరు కొంతవరకు మాత్రమే వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. కథలో సీరియస్ పాయింట్ ఉన్నా, దాన్ని పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేదని చెప్పాలి. నటీనటులు తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకుంటారు. సీరియస్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాదని చెప్పాలి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team