‘ప్రేమ వయసెప్పుడు పదహారే’ అంటున్న శర్వానంద్..?

‘ప్రేమ వయసెప్పుడు పదహారే’ అంటున్న శర్వానంద్..?

Published on Sep 2, 2014 12:44 PM IST

Sharwanand

‘రన్ రాజా రన్’ సినిమా విజయంతో మంచి జోష్ మీదున్న యంగ్ హీరో శర్వానంద్ తన కొత్త సినిమా టైటిల్ ఖరారు చేశారని సమాచారం. శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న లవ్ & ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ‘ప్రేమ వయసెప్పుడు పదహారే’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ టాక్. ‘ఓనమాలు’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు అందుకున్న క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతలు ఇంకా టైటిల్ ను అధికారికంగా ప్రకటించలేదు.

ఈ సినిమాలో శర్వానంద్ స్పోర్ట్స్ మెన్ గా నటిస్తున్నారు. ప్రేమకు కులం, మతం అడ్డుకావనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. నాజర్, తనికెళ్ళ భరణి, తేజస్వని, ఆహుతి ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు మాటలను అందిస్తున్నారు.

తాజా వార్తలు