ఓటిటి సమీక్ష : “ప్రేమ విమానం” (జీ5 లో ప్రసారం)

ఓటిటి సమీక్ష : “ప్రేమ విమానం” (జీ5 లో ప్రసారం)

Published on Oct 12, 2023 4:01 PM IST
Prema Vimanam Movie Review in Telugu

విడుదల తేదీ : అక్టోబరు 12, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అనసూయ భరద్వాజ్, సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా, ‘వెన్నెల’ కిశోర్, అభయ్ బేతిగంటి, గోపరాజు రమణ, సురభి ప్రభావతి, కల్పలత తదితరులు

దర్శకుడు : సంతోష్ కట్టా

నిర్మాత: అభిషేక్ నామా

సంగీతం: అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి

ఎడిటర్: అమర్ రెడ్డి కుడుముల

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సంగీత్ శోభన్, శాన్వీ మేఘన జంటగా అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ప్రేమ విమానం’. జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

 

తెలంగాణలోని రెండు పల్లెటూర్లలో 1990 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఓ పల్లెటూర్లో శాంతమ్మ(అనసూయ) తన భర్త ఇద్దరు పిల్లలు రామ్‌ లక్ష్మణ్‌(దేవాన్ష్‌ నామా, అనిరుథ్‌ నామా)లతో ఓ చిన్న గుడిసెలో బతుకుతూ ఉంటుంది. అప్పులతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ శాంతమ్మ చిన్న కొడుకు లచ్చు (అనిరుధ్ నామా)కు విమానంలో ప్రయాణించాలని బలమైన కోరిక ఉంటుంది. ఆ కోరిక కోసం తన అన్న రాముతో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ?, ఈ క్రమంలో వాళ్ళు పడిన ఇబ్బందులు ఏమిటి ?…., అలాగే మరోవైపు మణి (సంగీత్ శోభన్) – అతని తండ్రి (గోపరాజు రమణ)ది పల్లెటూరిలో చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉంటారు. ఐతే, ఆ ఊరి సర్పంచ్ కుమార్తె అభిత (శాన్వీ మేఘన)తో మణి ప్రేమలో పడతాడు. పెద్దలు పెళ్ళికి ఒప్పుకోరని ఇద్దరూ లేచిపోతారు. ఈ క్రమంలో వీళ్ళు పడిన ఇబ్బందులు ఏమిటి ?, చివరకు ఈ రెండు కథల్లోని ప్రధాన పాత్రలు ఎలా కలిశాయి ?, ఒకే కథగా ఎలా మారాయి ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

రెండు పల్లెటూర్లలోని 1990 నేపథ్యంలో జరిగే రెండు కథలను చాలా సహజంగా ఫీల్ గుడ్ ఎమోషన్స్ తో నడిపాడు దర్శకుడు. శాంతమ్మగా అనసూయ నటన చాలా బాగుంది. ఆమె ఇద్దరు పిల్లలు రామ్‌ లక్ష్మణ్‌ గా నటించిన దేవాన్ష్‌ నామా, అనిరుథ్‌ నామా కూడా చాలా బాగా నటించారు. ముఖ్యంగా అనిరుథ్‌ నామా నటన చాలా బాగుంది. విమానంలో ప్రయాణించాలనే కోరికతో పిల్లలు చేసే ప్రయత్నాలు.. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి. మరోవైపు మణిగా సంగీత్ శోభన్ నటన సినిమాకి ప్లస్ అయింది. మణి తండ్రి పాత్రలో గోపరాజు రమణ జీవించారు.

ఓ చిన్న పల్లెటూరిలో చిన్న కిరాణా కొట్టు నడుపుకునే సగటు తండ్రి పాత్రలో గోపరాజు రమణ నటన అద్భుతంగా ఉంది. హీరోయిన్ గా నటించిన శాన్వీ మేఘన కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ తో మెప్పించింది. హీరో హీరోయిన్ల ప్రేమ కథలోని ఫీల్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక కీలక పాత్రల్లో ‘వెన్నెల’ కిశోర్, అభయ్ బేతిగంటి, సురభి ప్రభావతి, కల్పలత తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

మనసును కదిలించే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ఆకట్టుకున్నప్పటికీ.. కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా దర్శకుడు సంతోష్ కట్టా కథనాన్ని పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కొన్ని కీలకమైన సన్నివేశాలు పర్వాలేదనిపించిన్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాలను స్లోగా నడిపారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన మధ్య లవ్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా సాగుతుంది. ప్రేమ కథలో సరైన సంఘర్షణ లేదు.

సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది ?, ప్రధాన పత్రాలు ఎలాంటి కష్టాల్లో పడతాయో?, అసలు వాళ్ళు వారి సమస్యల నుంచి ఎలా తప్పించుకుంటారో ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఇంకా పెంచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు మాత్రం, ఆ దిశగా సినిమాని నడపలేదు. ఇక సినిమా ఫస్టాఫ్ కథనం కూడా సాదా సీదాగానే గడిచిపోగా సెకండ్ హాఫ్ కథనం కొన్ని చోట్ల, మరింత నెమ్మదిగా సాగుతుంది. అనసూయ – దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా పాత్రల మధ్య బాండింగ్ ను ఇంకా బిల్డ్ చేసి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

 

మంచి కథాంశం తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు, ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు మాత్రం కొన్ని బాగా ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాత అభిషేక్ నామాను అభినందించాలి.

 

తీర్పు :

 

‘ప్రేమ విమానం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్, కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సినమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. మొత్తమ్మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు