తెలుగులోనూ తగ్గేదేలే అంటున్న ‘ప్రేమలు’

తెలుగులోనూ తగ్గేదేలే అంటున్న ‘ప్రేమలు’

Published on Mar 14, 2024 1:05 AM IST

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయి అక్కడ అత్యద్భుత విజయం అందుకున్న యూత్ఫుల్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ మూవీ ప్రేమలు. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ప్రేమలు సినిమాలో నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 9న మలయాళం రిలీజ్ కాగా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను దక్కించుకుంది. ఇక మార్చి 8న ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఇప్పటికే రూ.3 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

తెలుగులో ఈ మూవీకి రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మొదటి రోజుకు మించి ప్రతి రోజు మూవీకి రెస్పాన్స్ తో పాటు కలెక్షన్ కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తుండడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసారు. తెలుగు వెర్షన్‍కు 90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైలాగ్స్ రాశారు. ఇక ఈ మూవీ పై అనేకమంది ఆడియన్స్ తో పాటు సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు సైతం విశేషంగా ప్రసంశలు కురిపిస్తుండడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు