ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ విడియో లో స్ట్రీమ్ కానుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఇండియా లో కూడా విడుదల అయి ప్రేక్షకులని విశేషం గా ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగస్ట్ 14 వ తేదీన ప్రైమ్ విడియో ద్వారా విడుదల కానుంది. ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలతో పాటుగా హిందీ, తమిళ్ లలో కూడా ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. అయితే ఈ చిత్రం ప్రైమ్ విడియో లోకి వస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్ మరియు గాడ్జిల్లా ఫైట్స్ సన్నివేశాలను అత్యద్భుతంగా ఉండటం తో ఈ సినిమా ప్రైమ్ వీడియో లో సైతం ఆకట్టుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.