ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “గోట్ లైఫ్”

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “గోట్ లైఫ్”

Published on Jul 19, 2024 8:00 AM IST

మలయాళ స్టార్ హీరోస్ లో ఒకరైన టాలెంటెడ్ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన రీసెంట్ చిత్రాల్లో ఒకటే “గోట్ లైఫ్ – ఆడు జీవితం”. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్, పృథ్వీ రాజ్ పాన్ ఇండియా హిట్ “సలార్” తర్వాత రావడంతో మంచి దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే తెలుగులో అంతగా రాణించని ఈ చిత్రం మలయాళంలో భారీ హిట్ అయ్యింది. అక్కడ ఏడాదిలో మరో 100 కోట్ల సినిమాగా నిలిచి అదరగొట్టింది.

అయితే ఫైనల్ గా ఈ చిత్రం ఇప్పుడు ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి తెలుగులో చూడాలి అనుకునే వారు ఈ చిత్రాన్ని ఇప్పుడు చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు బ్లేస్సి వర్క్ చేయగా లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు